గ్రామపంచాయతీ కార్మికుల బకాయి జీతాలు వెంటనే ఇవ్వాలి
విధులు బహిష్కరించి కలెక్టరేట్ ముట్టడిస్తాం
సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య
గజ్వేల్ డిసెంబర్ 21 ప్రశ్న ఆయుధం :
గ్రామపంచాయతీ కార్మికులకు బకాయి పడ్డ ఆరు నుంచి నాలుగు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని సిఐటియు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు గజ్వేల్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రాంతంలోని గ్రామపంచాయతీ కార్మికులందరి కి పడ్డ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీవో కి వినతి పత్రం అందజేయడం జరిగింది గ్రామపంచాయతీ కార్మికులు అప్పులు చేసి జీవనం గడుపుతున్నారని గ్రామపంచాయతీ కార్మికుల పట్ల చులకన భావంతో చూస్తుందని ధర్నాలు చేస్తే తప్ప జీతాలు వేయడం లేదని విమర్శించారు. జిల్లాస్థాయి పంచాయతీ అధికారులు పనులు చేయిస్తున్నారు తప్ప కార్మికుల వేతనాలు పట్టించుకోవడంలేదని అన్నారు క్రిస్మస్ మరియు కొత్త సంవత్సరం వేడుకలు వస్తున్నాయని కానీ గ్రామపంచాయతీ కార్మికుల ఇబ్బందులు ఆందోళన నెలకొన్నాయని అన్నారు ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే వేతనాలు వేయాలని లేనిచో విధులు బహిష్కరించి ఆందోళన చేపడుతామని కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకట చారి, బాబురావు, ఎల్లం ,కనకయ్య, మల్లేశం, నాగరాజు, స్వామి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.