*ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ అప్రజాస్వామికం – మాజీ ఎంపీ నామ*
*ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను ఖండించిన – మాజీ ఎంపీ నామ*
(ప్రశ్న ఆయుధం ఖమ్మం జిల్లా డిసెంబర్ 26) బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్‌ను ఖండిస్తూ, బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ సరికాదు అన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, దళిత, బహుజన వర్గాల హక్కుల కోసం నిస్వార్థంగా పని చేస్తున్న శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన విమర్శించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ పై పెట్టిన కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని నామ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.