ఎస్సీ ఎస్టీ లకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హమిలపై అసెంబ్లీలో చర్చించాలి

ఎస్సీ ఎస్టీ లకు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హమిలపై అసెంబ్లీలో చర్చించాలి

– మాజీ మంత్రి ఎమ్మెల్యే హరిష్ రావుకు డిబిఎఫ్ వినతి

దుబ్బాక ప్రతినిధి, డిసెంబర్12

కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్పీ,ఎస్టీ లకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని అసెంబ్లీ లో చర్చించాలని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరిష్ రావుకు దళిత బహుజన ఫ్రంట్ విన్న వించినది.సీనియర్ జర్నలిస్ట్ ఆస శ్రీ రాములుతో కలిసి డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ లు గురువారం తన నివాసంలో హరిష్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ అధికారం లోకి రాగానె ఎన్నికల హమిలనువిస్మరించినదన్నారు. ముఖ్యంగా టిఅర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు పధకం స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం పేరుతో ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్ధిక సహయాన్ని అందజేస్తామనె హమి నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు.బడ్జెట్‌లో మొక్కుబడిగా నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారన్నారు.

ఎస్సీల రిజర్వేషన్ లను 18 శాతం పెంచుతామని హమిని సైతం మరిచారన్నారు.ఎస్సీ కార్పొరేషన్ ను మాల,మాదిగ ,ఉపకులాల కార్పొరేషన్ లుగా విభజిస్తామనె హమి పట్టించుకొవడం లేదన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించినప్పటికి కొత్త యాక్షన్ ప్లాన్ విడుదల చెయడం లేదన్నారు.గతంలో ని పెండింగ్ సబ్సిడీ లను విడుదల చేయడం లేదని తెలిపారు.ఉపాధి హమి కార్మికులకు సంవత్సరానికి 12 వేల ఆర్ధిక సహయ పధకం కార్యరూపం దాల్చలేదని,కౌలు రైతులకు రైతు భరోసా అమలు కావడం లేదని అందోళన వ్యక్తం చేశారు.అంబేద్కర్ విదేశి విద్యానిధికి నిధులు ఇవ్వడం లేదనిగరుకులాలు,సంక్షేమ హస్టల్ విద్యార్థులకు నాణ్యమైన ఆహార అందించకపొవడంతో కలుషిత ఆహారం వల్ల ఆసుపత్రుల పాలై మరణిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యార్దులకు అందజేస్తున్న మధ్యాహ్న భోజనం సైతం వికటిస్తు విద్యార్థులు ఆసుపత్రులపాలవుతున్నారన్నారు.పేదలకు భూపంపిణి ని అటకెక్కించారన్నారు.దాడులకు గురవుతున్నఎస్సీ,ఎస్టీ అట్రాసిటి బాధితులకు తక్షణ సహయం, నష్టపరిహారం అందించడం లేదు.పునరావాసంకల్పించడంలేదని41 సిఅర్పిసి పేరుతో నిందితులకు స్టేషను బెయిల్ ఇస్తుండటంతో దాడులు మరింత పెరుగుతున్నాయన్నారు.ఎస్సీ,ఎస్టిల పై దాడులను సమిక్షించి ఆరికట్టెందుకు ఎస్సీ,ఎస్టి అట్రాసిటి చట్టం ప్రకారం సంవత్సరంలో రెండుసార్లు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగాల్సిన హైపవర్ కమిటి సమావేశం జరగలేదన్నారు.ఎస్సీ,ఎస్టీ ఎస్డిఎఫ్ చట్టం ప్రకారం నిధుల కేటాయింపు లు జరగడం లేదని,చట్టం అమలు కావడం లేదన్నారు.దళితులసంక్షేమం,అభివృద్ధి రక్షణలు సమగ్ర అభివృద్ధి పై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని కొరగా మాజీ మంత్రి హరిష్ రావు సానుకూలంగా స్పందించారని శంకర్ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment