గజ్వేల్ సెప్టెంబర్ 12 ప్రశ్న ఆయుధం :
నేడు బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారి నివాసం పైన కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం హేయమైన చర్య అని బిఆర్ఎస్ జిల్లా యువజన విభాగం కార్యదర్శి ముచ్చపతి బాలయ్య అన్నారు. హైదరాబాదులోని కౌశిక్ రెడ్డి నివాసం పైన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అనుచరులు మరియు కాంగ్రెస్ గుండాలు వెళ్లి దాడి చేసి, అసభ్యకరంగా దుర్భాషలాడుతూ అరికపూడి గాంధీ గారు తాను ఒక ఎమ్మెల్యే అని సోయి లేక తన గుండాలను రెచ్చగొట్టి దాడి చేయించడం సిగ్గుచేటు. ఈ దాడి తెర వెనుక ఉండి నడిపిస్తున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, మీరు తెలంగాణ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజాపాలనాని చెప్పడానికి సిగ్గుండాలి, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి సరికాదు. ఈ దాడులు ఎవరు చేసినా ఇంతకు మించి ప్రతికారాన్ని ఎదుర్కోక తప్పదు. మా బి ఆర్ ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే మీరు తెలంగాణలో ఎలా తిరుగుతారో మేము చూస్తాం.