ఎమ్మెల్యే ఇంటి పై దాడి హేయమైన చర్య

*ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై దాడి హేయమైన చర్య*

*బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కోఆర్డినేటర్ జువ్వాజి కుమారస్వామి*

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 12*

హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం అమానుషమని హేయమైన చర్య దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కోఆర్డినేటర్ జువ్వాజి కుమారస్వామి అన్నారు. కుమారస్వామి మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాదులోని తన నివాసం పై హైదరాబాద్ ఎమ్మెల్యే గాంధీ దాడి చేయడం సిగ్గుచేటు అని సహాఛర ఎమ్మెల్యేను అనుచిత పదజాలంతో తిడుతూ వందలాది మంది అనుచరులతో ఇంటిని ధ్వంసం చేయడం దాడి చేయడం ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఒకపక్క ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు అదే ఎమ్మెల్యే గాంధీకి ఎస్కార్ట్ వాహనంతో తనను తన సహచరులను తీసుకొని వచ్చేలా చేయడంలో పోలీసుల వైఫల్యం వారి సహకారం ఉందని అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు. మొన్న సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం పై దాడి ఖమ్మంలో వరద బాధితులను పరామర్శకు వెళ్తే అక్కడ దాడికి ప్రయత్నం నేడు ఒక ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడం ఇట్లాంటి వాటిని తెలంగాణ సమాజం సహించదని ఈ దాడులన్నీ సీఎం రేవంత్ రెడ్డి సీఎంఓ డైరెక్షన్లోనే జరుగుతున్నాయని దీనికి తప్పకుండా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ దీటుగా సమాధానం చెబుతుందని తెలియజేశారు. ఇదేనా ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అని ఆయన ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now