రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న బావిని పుడ్చాలని 10 గ్రామాల ప్రజలు మొరపెట్టుకున్న పట్టించుకోని అధికారులు

రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న బావిని పుడ్చాలని 10 గ్రామాల ప్రజలు మొరపెట్టుకున్న పట్టించుకోని అధికారులు

అధికారుల నిర్లక్ష్యంతో దత్తు అనే యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి

శవాన్ని రోడ్డుపై పెట్టి మైకోడ్ గ్రామస్తుల ఆందోళన

బావిలో పడి మృతి చెందిన దత్తు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి

ప్రమాదకరంగా రోడ్డు పక్కన ఉన్న బావిని వెంటనే పుడ్చాలి

రైతుకు ప్రభుత్వమే ఉచితంగా బోరు వెయ్యాలి

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 25

మనూరు మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన గొల్ల దత్తు అని యువకుడు హైదరాబాద్ పనికి నిమిత్తం తెల్లవారుజామున వెళ్తుండగా మనూర్ శివారులోని రోడ్డు పక్కన ఉన్న బావిలో బైకు స్కిడ్ అయి పడి మృతి చెందినడు. రోడ్డు పక్కన ప్రమాదకరంగా ఉన్న బావిని కూర్చోవాలని ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోలేదని దత్తు శవాన్ని రోడ్డుపై పెట్టి ప్రజల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.. మనూర్ మండల కేంద్రం కావడంతో మైకోడ్, రాణాపూర్, తుమ్మూరు, మొగ్దుంపూర్, బోరంచ జిన్నారం, రాయిపల్లి దుదిగొండ గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ప్రజలు ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రముఖ బోరంచ నల్లపోచమ్మ దేవస్థానం ఉండడంతో వేలాదిమంది భక్తులు ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణిస్తున్నారు. రోడ్డుకు ఆనుకొని భావి ఉండడంతో భయం భయం తో అరిచేతులో ప్రాణాలు పెట్టుకుని ప్రజల ప్రయాణం చేస్తున్నారు వింత ప్రమాదకరమైన భావిని పూడ్చాలని అనేకమార్లు ప్రజలు అధికారులు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదు..

అధికారుల నిర్లక్ష్యంతోనే దత్తు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినాని సిపిఎం గ్రామ శాఖ భావిస్తుంది.

దత్తు కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే బావిని పూడ్చాలని, రోడ్డు పనులు ప్రారంభించాలని, బావిని పూడ్చితే నష్టపోయే రైతును ప్రభుత్వమే ఉచితంగా బోరు వేసి మోటర్ బిగించాలని డిమాండ్ చేశారు..

గత 20 సంవత్సరాల క్రితం సిసి రోడ్ వేశారు ఇప్పటివరకు రోడ్డు వెయ్యలేదని, అధికారులు ఎన్నిసార్లు విన్నవించిన, చాలామందికి ప్రమాదాలు జరిగిన, పత్రికలలో కథనాలు రాసిన అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని, దానివల్లనే ఒక ప్రాణం బలిగున్నదని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం మనూరు మండల శాఖ డిమాండ్ చేస్తుంది. రోడ్డు వేయడంలో ప్రభుత్వం అధికారులు కుమ్మక్కయ్యారని కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment