హోతీ బీ గ్రామ అభివృద్ధి పై అధికారులు దృష్టి పెట్టాలి

మాజీ డివైఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏ అవినాష్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఆర్ సి ఇంచార్జ్ సెప్టెంబర్ 18 /(ప్రశ్న ఆయుధం న్యూస్)

జహీరాబాద్ మండలంలో హోతి బి గ్రామంలో అభివృద్ధి లేకపోవడంతో గల్లీలలో మురికి కాలువలు లేకపోవడంతో మురికి నీళ్లు మొత్తం రోడ్డుపైకి వస్తున్న అధికారులు ఎలాంటి దృష్టి సాదిస్తలేరు అని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) సంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు ఏ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు హోతీ బి గ్రామపంచాయతీ మండల్ లోని అతిపెద్దగా గ్రామపంచాయతీ ఉన్న అభివృద్ధి మాత్రం శూన్యం
కాలుష్యంతో నిండిపోయిన హోతి బి గ్రామం
బాధలు చెప్పినా పట్టించుకోని అధికారులు
హోతీ బి గ్రామంలో కాలుష్యంతో నిండి పోయింది అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వర్షం పడితే ఇళ్లలోకి కూడా పోవడానికి రావడం లేదని చెప్తున్నారు, వీధి లలో చెత్త చెదారం నిండి పోయింది అని చెత్తను కూడా తీసుకు పోయే వారు లేరు అని, దాని వళ్ళ అనారోగ్యానికి గురైతున్నము అని చెప్తున్నారు, వీధి లలో లైట్స్ లేవు , చీకటి లో ఉండాల్సి వస్తుంది, గ్రామ కార్యదర్శి కి ఎన్ని సార్లు చెప్పినా బడ్జెట్ లేదు అని చెప్తున్నారు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ గ్రామానికి రావడం లేదు మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యలను తీర్చాలని కోరుతున్నాము. లేనియెడల ఆందోళనలు తప్పు అని హెచ్చరించారు

Join WhatsApp

Join Now