అవినీతి నిర్మూలన సమితి అవేర్నెస్ ప్రోగ్రాం

*అవినీతి నిర్మూలన సమితి అవేర్నెస్ ప్రోగ్రాం

ముఖ్యఅతిథిగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ త్రివేది

IMG 20250810 WA0053 ప్రశ్న ఆయుధం హైదరాబాద్: ఆగస్టు 10

అవినీతి నిర్మూలన సమితి అవేర్నెస్ ప్రోగ్రాం హైదరాబాదులో అనోమోల్ కాంటినెంటల్ హోటల్లో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ త్రివేది వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ స్పోక్స్ మెన్ సయ్యద్, నేషనల్ అబ్జర్వర్ బిక్షపతి, మీరజ్ ఖాన్, డాక్టర్ రవీందర్, నయీమ్, ధన్నారపు రాజలింగం,తేజ, వాణి, సుదర్శన్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ కమిటీ ద్వారా జరుపబడ్డది. ఈ కార్యక్రమంలో వచ్చిన వారందరూ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కు సన్మానం చేశారు. అలాగే కార్యక్రమం అనంతరం అందరికీ అలోక్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అలోక్ మాట్లాడుతూ వచ్చిన కార్యకర్తలందరికీ దశ దిశ నిర్దేశం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రజలందరికీ సేవ చేయాలని తెలిపారు, కమిటీలు పనిచేసిన వారికి సేవ చేసిన వారికి మాత్రమే గుర్తింపు ఉంటుంది అని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment