ఈనెల 18న బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బంద్ ను విజయవంతం చేయాలి
జమ్మికుంట అక్టోబర్ 16 ప్రశ్న ఆయుధం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 18న బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బందులో జమ్మికుంట ప్రాంత ప్రజలు బందును సంపూర్ణంగా విజయవంతం చేయాలని బిసి ఉద్యోగస్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బేట రవీందర్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి టంగుటూరి రాజ్ కుమార్, మండల అధ్యక్షుడు ఏబూసి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆకుల రాజేందర్ లు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక చాణిక్య డిగ్రీ కళాశాల లో బీసీ సంఘాల నాయకుల తో సన్నాహక సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ, ఈనెల 18న శనివారం బీసీ జేఏసీ సంఘాలు ఇచ్చిన బందుకు సంఘీభావం తెలుపుతూ, జమ్మికుంట పట్టణంలో బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు పట్టణంలోని అన్ని కుల సంఘాలకు చెందిన, అన్ని పార్టీలకు చెందిన, అన్ని వర్గాలకు చెందిన బిసి నాయకులంతా ఒక్క తాటిపై ఉండి బీసీ రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం చేయవలసిన ఆవశ్యకత అవసరము ఎంతైనా ఉందన్నారు. హుజరాబాద్ నియోజకవర్గం లోని వీణవంక జమ్మికుంట ఇల్లందకుంట హుజురాబాద్ మండలాల లో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సంపూర్ణంగా బందు పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు ముద్రగడ నవీన్ కుమార్,
కాసుల కిరణ్ కుమార్, దాసరి రామ్మూర్తి, ధర్ముల శంకర్, బండి ప్రభాకర్, గుడిమల్ల బలరాం, రాంబాబు, మల్లికార్జున్, ఆకుల పోచయ్య, ఆవుల తిరుపతి, రావుల అశోక్, బూరుగుపల్లి నాగరాజు, కొమ్ము నరేష్, కైలాసకోటి గణేష్, చుక్క భాస్కర్, రాజమౌళి, పూసాల శ్రీనివాస్, అనుదీప్, రాకేష్, శ్రీనివాస్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.