Site icon PRASHNA AYUDHAM

నూతన జిల్లాల వారీగా బీసీ కమిషన్ వినతులను స్వీకరించాలి

IMG 20241101 WA0116

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఇందిర ఆధ్వర్యంలో ఈరోజు 11 గంటలకి జిల్లా కలెక్టర్  కార్యాలయంలో బీసీ కమిషన్ కు సమర్పించే వినతి అఫిడవిట్లు తదితర దరఖాస్తు ఫారాలను తెలియజేయుటకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల వారిగా వెనుకబడిన కులాల సమస్యలను తెలుసుకొనుటకు నిర్ణయించారు కానీ ఈ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు చెందిన కులాల జనాభా ఆర్థిక స్తోమత గుర్తించే ఉమ్మడి జిల్లాల కంటే నూతన జిల్లాలు వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి బీసీల సమస్యలను తెలుసుకోవాలని భద్రాద్రి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు కురిమెల్ల శంకర్ రాష్ట్ర కార్యదర్శి కొదుమూరి సత్యనారాయణ జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సమావేశంలో అంకినీడు ప్రసాదు చిటికెన ముసలయ్య శ్రీనివాస్ తాళ్లూరి సత్యనారాయణ రాంబాబు మృత్యుంజయ రాజ్ గౌడ్ వెనకబడిన తరగతుల శాఖ ఏబిసిడబ్ల్యుఓ నందు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version