Site icon PRASHNA AYUDHAM

కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభం

WhatsApp Image 2025 03 01 at 12.09.43 PM

కోటి తలంబ్రాల దీక్ష ప్రారంభం

– రామకోటి రామరాజు నిర్విరామ కృషి, పట్టుదల అమోగం

– ఎఫ్.డి.సి. మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి

– గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి

గజ్వేల్, 01 మార్చి 2025 : శ్రీరామనవమి నాడు భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఒలిచిన తలంబ్రాలు మాత్రమే వాడతారు. ఈ గోటి తలంబ్రాల అవకాశం తెలంగాణ నుండి గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజానికి దక్కింది. కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం శనివారం నాడు కృష్ణాలయం లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎఫ్డిసి మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మన గజ్వేల్ ప్రాంతం నుంచి ముచ్చటగా మూడోసారి గోటి తలంబ్రాలు భద్రాచలం వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. భద్రాచల దేవస్థానం వారు రామకోటి రామరాజు సేవలు గుర్తించి ఇలాంటి అద్భుత కార్యక్రమం అప్పజెప్పడం ఆయన రామభక్తికి నిదర్శనం అన్నారు. గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే వడ్లను ఓలిపించి భద్రాచల పంపించడం మళ్ళీ వారికి కళ్యాణం అనంతరం కళ్యాణ తలంబ్రాలు అందించడం అన్నది శ్రమతో కూడుకున్న పని. కానీ రామకోటి రామరాజు రామభక్తితో చేస్తున్నాడన్నాడు. ఆయన చేస్తున్న సేవలు అపారమైనవని ఘనంగా సన్మానించి మరో భక్త రామదాసును చూస్తున్నాడన్నాడు. భక్తులందరికి ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా గోటి తలంబ్రాల ప్యాకెట్లు అందజేశారు.

Exit mobile version