గాంధారిలో పూర్వ ప్రాథమిక తరగతుల ప్రారంభం
గాంధారి, సెప్టెంబర్ 15 (ప్రశ్న ఆయుధం):
కామారెడ్డి జిల్లా గాంధారిలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను మండల విద్యాధికారి వి. శ్రీహరి సోమవారం ప్రారంభించారు.
4 సంవత్సరాలు నిండిన పిల్లలను పూర్వ ప్రాథమికంలో చేర్పించాలని సూచించారు. గాంధారి మండలంలో ఈ తరగతులు మూడు పాఠశాలల్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. వాటిలో గాంధారి ప్రాథమిక బాలికల పాఠశాల, వండ్రికల్ ప్రాథమికోన్నత పాఠశాల, గాంధారి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయని ఆయన తెలిపారు.
తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాధికారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఎఎపీసీ చైర్మన్ వడ్ల శారద, హెడ్ మాస్టర్లు కల్పన, భవ్యశ్రీ, సీఆర్‌పీ రాజు, రామారావు, పూర్వ ప్రాథమిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.