*బంతి పూల తోటలో లాభాలు వాటి సస్య రక్షణ చర్యలు*
*కృషి విజ్ఞానం శాస్త్రవేత్త వేణుగోపాల్*
*కరీంనగర్ ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 21*
తెలంగాణ రాష్ట్ర పండుగగా భావించే దసరా పండుగకి ఎక్కువగా మార్కెట్ అయ్యే పూలు బంతిపూలు, ఈ మధ్యకాలంలో పూలలో ఎక్కువగా సాగులో ఉన్న పూల పంటలలో బంతి ప్రధానమైనది మన ప్రాంతాలలో బంతిని ఎక్కువగా ఇంటి అలంకరణలోను దేవాలయాల్లో దండలలోను ఉపయోగిస్తున్నారు. వినాయక చవితి దసరా దీపావళి పండుగలకు, అలంకరణలో బంతి పూలను విరివిరిగా ఉపయోగిస్తారు. వివాహాలకు గృహప్రవేశాలకు ఫంక్షన్లకు విరివిగా బంతిపూలను ఉపయోగిస్తారు కనుక బంతిని సరైన సమయంలో నాటుకోవటం ఎక్కువ దిగుబడి ఎక్కువ ధరకి పూలని అమ్మి, అధిక లాభాలను గడించవచ్చు అని కెవికె శాస్త్రవేత్త వేణుగోపాల్ అన్నారు. పంట సమయంలో (జూన్-జనవరి) తేమ గాలిలో ఆర్ధత ఎక్కువగా ఉండటం వలన, తెగుళ్లు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్నందున సరైన జాగ్రత్తలు పాటించి అధిక, నాణ్యమైన దిగుబడులను సాధించవచ్చును అని పేర్కొన్నారు
*బంతి తోటలో సస్య రక్షణ*
*ఎర్రనల్లి వ్యాధి* ఆకులన్నీ ఎండిపోతున్నట్టుగా ఉండి పత్ర హరితం లోపించి ఎండిపోతూ ఉంటాయని చెట్టు మొత్తం ఎండిపోతుందని దీని నివారణ కు ప్రోపర్గైట్ మందుని లీటర్ నీటికి 2 మీ.లీ లను కలిపి పిచికారి చేయాలని *ఆకుపచ్చపురుగు* పూ మొగ్గల్లో లేత చిగురులని తింటూ నాశనం చేస్తూ ఉంటుందని దీని నివారణ: నోవల్యురాన్ ఏమమెక్టిక్ బెంజోయేట్ కలిసిన ద్రావణాన్ని లీటర్ నీటికి 2 మీ లీ లు కలిపి పిచికారి చేయాలని *బూడిద తెగులు* ఈ తెగులు సోకిన మొక్కల పైభాగాలలో తెల్లని మచ్చలు ఏర్పడుతాయని బూడిద రంగులో శిలీంధ్రం పూత లాగా ఏర్పడతాయని వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నచో ఈ తెగులు ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారి చేయాలని*పూ మొగ్గ కుళ్లిపోవుట* ఆల్టర్నేరియా డయాంతి అనే శిలీంధ్రం వలన బంతి పుష్పాలలో ఈ తెగులు సంభవిస్తుందని ఈ శిలీంధ్రం అప్పుడే వచ్చినటువంటి పూ మొగ్గలకు సోకుతుందని ఇలా తెగులు సోకిన పూ మొగ్గలు వడలిపోయని ముదురు గోధుమ రంగులోకి మారుతాయని ఈ శిలీంధ్రం ఆకులకు కూడా సోకి, ఎండిపోయేలాగా చేస్తుందని ఈ శిలీంధ్రం నల్లని మచ్చల వలె ఆకుల చివర్ల పై ముదిరిన ఆకుల కొనలపై కనిపిస్తుందని దీని నివారణకు మ్యాంకోజెబ్ 2 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్కలపై మ్మ పిచికారి చేసుకోవాలని శాస్త్రవేత్త వేణుగోపాల్ తెలిపారు
ఆకుమచ్చ తెగులు ఆకు ఎండు తెగులు: ఆల్టర్నేరియా, సెర్కోస్పోరా సెష్టోరియా అనే శిలీంధ్రాల వల్ల ఈ తెగులు
సంభవిస్తాయని పేర్కొన్నారు ఈ తెగులు సోకిన ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడుతాయని తరువాత దశలో ఈ మచ్చలు అన్నీ కలిసి ఒక వలయంలో ఏర్పడి ఆకులు ముడుచుకుంటాయని తెగులు తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు రాలిపోతాయని అందుకు నివారణ పొలంలో నీరు నిలువకుండా చూసుకోవాలని తెగులు సోకిన మొక్కలను పొలం నుండి తీసివేయాలని మ్యాంకోజెబ్ 3 గ్రా. లేదా కార్బండాజిమ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని
కాండం కుళ్ళు తెగులు(ఫైటోప్తారా క్రిప్తోజియా):
ఈ తెగులు కాండం భాగంలో నల్లని మచ్చలు కలిగిస్తుందని క్రమేపి తెగులు సోకిన కాండం కుళ్ళి మొక్క చనిపోవడం జరుగుతుందని దీని నివారణ: సోకిన చెట్లకు కాబ్రియో టాప్ మందుని లీటరు నీటికి ౩ గ్రా లు కలిపి పిచికారి చేయాలని.
పెళిల్ల కోసం,ఇతర ఫంక్షన్ ల కోసం నాటు కునే వాళ్ళు నారు దాశలో ఉన్నట్లయితే నారుకుళ్ళు తెగులు: ఈ తెగులు నారుమడి దశలో లేత మొలకలపై నల్లగా గుండ్రని మచ్చలు లాగా ఏర్పడటం వలన మొలకలు పడిపోవడం జరుగుతుందని నారుమడిలో సరైనటువంటి చర్యలు పాటించని నివారణకు
విత్తనాన్ని విత్తుటకు ముందు నారుమడులను ఫార్మలిన్ 2 శాతంతో నేల శుద్దీకరణ చేసుకోవాలని థైరామ్ లేదా కాప్టాన్ 2-3 గ్రా. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలని
బోర్డాక్స్ మిశ్రమం 0.1 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ళు తడిచే లాగా పిచికారి చేయాలని పంటను వేయడానికి ముందు కొమ్మ శాఖలను ధైరమ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి తయారు చేసిన ద్రావణంలో ముంచాలని
కిలో విత్తనానికి కార్బండాజిమ్ 2.5 గ్రా.తో విత్తనశుద్ధి చేసుకోవాలని ట్రైకోడెర్మా 10 గ్రా.ల మిశ్రమాన్ని ఒక కిలో విత్తనాలకు కలిపి విత్తుకోవడం వలన కొంత వరకు ఎండు తెగులును నివారించ వచ్చునని కృషి విజ్ఞానం, ఉద్యానవన శాస్త్రవేత్త వేణుగోపాల్ తెలిపారు