డాక్టర్ల డిమాండ్కు తాలోగ్గాని బెంగాల్ సర్కార్

*డాక్టర్ల డిమాండ్లకు తలొగ్గిన బెంగాల్ సర్కార్*

 

హైదరాబాద్:సెప్టెంబర్ 17

 

పశ్చిమ బెంగాల్లో జూని యర్ వైద్యుల ఆందోళన దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. నెలరోజులకు పైగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యుల డిమాం డ్లు నెరేవేర్చేందుకు బెంగాల్ ప్రభుత్వం సోమవారం రాత్రి వారి డిమాండ్లను అంగీక రించినట్టు తెలిసింది .

 

నాలుగుసార్లు రద్దు అయిన తర్వాత సోమవారం రాత్రి జూనియర్ డాక్టర్లు సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. దాదాపు 6గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో వైద్యులు ప్రభు త్వం ముందు ఉంచిన 5 డిమాండ్లకు దీదీ సర్కార్ అంగీకరించింది.

 

ఐదు డిమాండ్లలో మూడిం టికి మమతా బెనర్జీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు వారి డిమాండ్లు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

ఇందులో భాగంగానే వైద్యులతో సమావేశం ముగిసిన అనంతరం గంటల వ్యవధి లోనే కోల్ కతా సీపీ వినీత్ గోయల్, వైద్యశాఖకు చెందిన ఇద్దరు అధికారులను తొలగిస్తున్న ట్లు ప్రభుత్వం ప్రకటించింది.

 

తొలగించిన అధికారుల స్థానంలో కొత్త అధికారు లను నియమించనున్నట్లు వెల్లడించింది. ఇక డిమాం డ్లకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో వారి ఆందోళ నలను విరమించాలని వైద్యులను దీదీ కోరారు.

 

ఆందోళనకారులపై చర్యలు తీసుకోబోమని వెంటనే విధుల్లో చేరాలని విజ్నప్తి చేశారు. సామాన్య ప్రజలు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారంటూ ఆవే దన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now