*భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించే పార్టీ భారతీయ జనతా పార్టీ…రవికుమార్ యాదవ్*
*ప్రశ్న ఆయుధం,ఏప్రిల్ 14,శేరిలింగంపల్లి,ప్రతినిధి*
ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి,ఆయన తన జీవితాంతం అంటరానితనం మరియు కుల వివక్ష వంటి సామాజిక దురాచారాలపై పోరాటం చేస్తూ సమాజంలో వెనుకబడిన వర్గాల వారికి విద్య, సమానత్వం మరియు గౌరవం లభించే విధంగా కృషి చేసిన నాయకుడు అంబేద్కర్.
ఆయన చేసిన అవిశ్రాంత కృషి ఫలితంగానే నేడు మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను కలిపిస్తుందని గుర్తు చేస్తూ,
భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ పోషించిన పాత్ర ఎన్నటికీ మరువలేనిది. ఆయన తన అపారమైన జ్ఞానంతో, దూరదృష్టితో ఒక బలమైన మరియు సమగ్రమైన రాజ్యాంగాన్ని మనకు అందించారు. ఈ రాజ్యాంగం దేశంలోని బలహీన వర్గాలకు ఒక రక్షణ కవచంలా నిలుస్తుంది అన్నారు.నేటికీ, డాక్టర్ అంబేద్కర్ ఆశయాలు పూర్తిగా నెరవేరలేదు. కుల వివక్ష, అసమానతలు ఇంకా మన సమాజంలో అక్కడక్కడ ఉన్నాయని ,ఆయన చూపిన బాటలో మనం నడవాలని,ప్రతి ఒక్కరూ సమానంగా చూడబడే ఒక న్యాయమైన మరియు సమతావాద సమాజాన్ని నిర్మించడానికి మనమంతా కలిసి కృషి చెయ్యాలి అని తెలియజేస్తూ
యువత డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన పట్టుదల, జ్ఞాన తృష్ణ మరియు పోరాట తత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలి సూచిస్తూ ,ఆయన ఆశయాలను నెరవేర్చడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్ అధ్యక్షులు, కంటెస్టెడ్ కార్పొరేటర్స్, మహిళా మోర్చా, బీజేవైఎం, దళిత మోర్చా, మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.