దర్శనం కోసం వెళ్తే బైక్ పోయింది
– పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
దేవుడి దర్శనం కోసం వెళ్తే తన బైక్ ని ఎవరు దొంగలు ఇచ్చారని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఘన్ష్యం శంకర్ రావు పోస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి పట్టణ కేంద్రానికి చెందిన
ఘన్ష్యం శంకర్ రావు తెదీ 2/2/2025 రోజున తన బైక్ పైన చుక్కాపూర్ లో లక్ష్మి నరసింహ స్వామి గుడికి వచ్చి బైక్ని టెంపుల్ ముందర పార్క్ చేసి దర్శనం కోసం గుడి లోపలికి వెళ్లి తిరిగి వచ్చేసరికి తన బైక్ ని ఎవరు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని దరఖాస్తు చేయగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.