Site icon PRASHNA AYUDHAM

బీసీ ప్రధానమంత్రి అంటూ ప్రచారం చేస్తున్న బిజెపి తెలంగాణ బీసీలకు అన్యాయం చేస్తుంది

IMG 20250810 WA0027

బీసీ ప్రధానమంత్రి అంటూ ప్రచారం చేస్తున్న బిజెపి తెలంగాణ బీసీలకు అన్యాయం చేస్తుంది

సిపిఎం మండల కార్యదర్శి కొప్పుల శంకర్

*జమ్మికుంట ఆగస్టు 10 ప్రశ్న ఆయుధం*

బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి, 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని హుజురాబాద్ మండల కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు ఆదివారం రోజున హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ ల కి 42 శాతం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని ధర్నా నిర్వహించారు అనంతరం కొప్పుల శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపిందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ 42 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేయకుండా రిజర్వేషన్లకు మతం రంగు పులుముతున్నదని విమర్శించారు. రిజర్వేషన్లు ఇచ్చేది మత ప్రాతిపాదికన కాదని, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక రాజకీయ సామాజిక సమాన అవకాశాలు కల్పన కోసం అన్న అంశాన్ని బిజెపి పక్కన పెడుతుందని విద్య, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో సమానత్వాన్ని నిరాకరిస్తున్నదని,అందుకే బీజేపీ బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టాలని భావిస్తుందన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మత ప్రతిపాదికన ప్రజలను విభజించడం కోసం రిజర్వేషన్లను మతానికి పరిమితం చేస్తున్నారని విమర్శించారు. చట్ట సవరణ చేసి భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని, ఆ దిశగా బీసీ రిజర్వేషన్లకు సైతం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు అసెంబ్లీలో బిల్లుకు మద్దతిచ్చి చేతులు దులుపుకొని ఇప్పుడు మతం రంగు పులమడం బిజెపి దివాలా కోరు రాజకీయ విధానాలకు నిదర్శనంగా కనిపిస్తుందన్నారు బిజెపి నాయకులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తొండి మాటలు మాట్లాడుతూ బిసి వర్గాలను మోసం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి సైతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తున్నదని పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని సిపిఎం పోరాడుతుంటే,సిపిఎం నాయకులను రాష్ట్రవ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేస్తూ నిర్బంధాలను కొనసాగిస్తున్నదని విమర్శించారు అఖిలపక్ష రాజకీయ పార్టీలను కలుపుకొని కేంద్రం పై పోరాడాలన్నారు.బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందన్నారు. బిజెపి పార్టీ, నాయకుల ద్వంద నీతిని ప్రజల్లో ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు.బీసీలకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రామ గ్రామాన సమావేశాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామన్నారు.కుల గణన జరపాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుప్పటికీ,నాన్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్న బిజెపికి ప్రజా పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలని ఆ దిశగా పోరాడుతున్న సిపిఎం పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతును ఇచ్చి పోరాటాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దాట్ల రత్నాకర్, మాట్ల చిరంజీవి,ఇమ్మడి శ్రీకాంత్, శనిగరపు కొమురయ్య, ఉమా సరోజన, ములుగూరు ప్రేమ్ కుమార్, ఆకునూరి సుధాకర్, వడ్లూరు లక్ష్మీనారాయణ శంకర్ తదితరులు పాల్గొన్నారు .

Exit mobile version