27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో బిజెపి జెండా ఎగిరింది
ప్రశ్న ఆయుధం 08 ఫిబ్రవరి ( బాన్సువాడ ప్రతినిధి)
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచడం జరిగింది. బిజెపి నాయకులు మాట్లాడుతూ… 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో బిజెపి జెండాను ఎగరవేయడం జరిగిందని. దేశంలో ఎక్కడా ఎలక్షన్లు నిర్వహించిన బిజెపి పట్ల ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించడం జరుగుతుందని మోడీ పైన దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని అందుకే ఎక్కడ ఎన్నికలు నిర్వహించిన ఢిల్లీ నుంచి గల్లి వరకు బిజెపి విజయం సాధిస్తుందని వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ లో బిజెపికి గెలిపిస్తారని వారు అన్నారు దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం పోయిందని దానికి ఉదాహరణ ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు అని బిజెపి నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీనివాస్ రెడ్డి మోహన్ రెడ్డి గంగారెడ్డి చిరంజీవి శంకర్ గౌడ్ చిదర సాయిలు లక్ష్మీనారాయణ చీకట్ల రాజు వెంకట్ ఉమేష్ సిద్ధార్థ అశ్విన్ శంకర్ భాస్కర్ రెడ్డి అరుణ్ కుమార్ సుధాకర్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.