వినతి పత్రాన్ని అందించిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ..

భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి రాష్ట్ర గవర్నర్  @Jishnu_Devvarma ని కలిసి వినతి పత్రాన్ని అందించిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు , నాయకులు.

IMG 20241021 WA0059ఈ కార్యక్రమంలో ఎంపి  ఈటల రాజేందర్ , రఘునందన్ రావు , కొండా విశ్వేశ్వర్ రెడ్డి , బిజెపి ఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి , వేంకట రమణ రెడ్డి , శ్రీ పాల్వాయి హరీష్ , మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్,  చింతల రామచంద్రారెడ్డి , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి. ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

హైదరాబాదులో గత రెండు మూడు నెలలుగా హిందువుల విశ్వాసాన్ని దెబ్బతీసేలా హిందూ దేవాలయాల మీద బయట నుంచి వచ్చిన కొంతమంది దుర్మార్గులు దాడులు చేస్తున్నారు.

ఒక పక్క ధ్వంసం జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు.

ప్రజలకు సమాచారం అందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసిన వ్యక్తులు పక్కనే ఉన్న హోటల్లో ట్రైనింగ్ పొందారు. అక్కడే ఉన్న మసీదులో షెల్టర్ తీసుకున్నారు. 

ఉదయం నాలుగు గంటల సమయంలో అమ్మవారి ఆలయం మీద దాడి చేశారు. స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే మతిస్థిమితం లేని వాడని ముద్రవేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు ట్రైనింగ్ తీసుకొని ఈ పని చేశారని ప్రజలు గట్టిగా ప్రతిఘటిస్తే.. మాలాంటి వాళ్ళం వెళ్లి నిలదీస్తే అసలు నిజం బయటికి వచ్చింది.

హైదరాబాదులో ఇట్లాంటి 15 టీంలు ట్రైనింగ్ పొంది హిందూ మనోభావాలు దెబ్బకొట్టే దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారు.

ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కల్పించే ప్రయత్నం కూడా జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదు. ప్రభుత్వం స్పందించాలని ధర్నా కార్యక్రమం చేశాము.

శాంతియుతంగా మేము ర్యాలీ తీస్తుంటే పోలీసులు దుర్మార్గంగా అకారణంగా పాశవికంగా మావాళ్ళ తలలు పగలగొట్టారు.

 

ఈరోజు గవర్నర్ ని కలిసి.. 

ఇప్పుడిప్పుడే హైదరాబాదులో ప్రశాంత వాతావరణం నెలకొంది.

సాయిబాబా టెంపుల్, లుంబిని పార్క్, గోకుల్ చాట్ వద్ద పేల్లులలో పదుల సంఖ్యలో తెగిపడ్డ కంఠాలు, చిందిన రక్తం, పోయిన అమాయక ప్రజల ప్రాణాలు ఇంకా మర్చిపోలేదు. మళ్లీ అలాంటి కుట్రకి ఈ దుర్మార్గులు తెరలేపే అవకాశం ఉందని గవర్నర్ కి తెలియజేయడం జరిగింది. 

ప్రభుత్వం ఇప్పటివరకు మెట్రో పోలీస్ హోటల్ లో జరిగిన మీటింగ్ సమాచారం ఇవ్వలేదు.

రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైంది. 

ఇలాంటి వాటిని గమనించడంలో, నిలువరించడంలో విఫలమైంది.

ఈ ప్రభుత్వానికి చేతకాకపోతే NIA కు అప్పజెప్పి సమగ్రమైన విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి… ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గవర్నర్ ని కోరడం జరిగింది.

 

Q&A: 

ముత్యాలమ్మ గుడి పై దాడి జరిగిన తర్వాత ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు.. ఎందుకు సరైన సమాచారం ప్రచారం ప్రజలకు ఇవ్వలేదు.. పక్కనే ఉన్న లాడ్జిలో వందల సంఖ్యలో ట్రైనింగ్ తీసుకుంటున్న వారిని, ఇస్తున్న ఎందుకు అదుపులోకి తీసుకోలేదు.

గుండెల మీద తన్నారని అక్కడ ప్రజలు బాధపడుతుంటే మేము వెళ్లి డిమాండ్ చేసే వరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన లేదు.

వేలాది మంది వచ్చి ర్యాలీ తీసిన తర్వాతనే ప్రభుత్వం స్పందించింది అంటే ఈ ప్రభుత్వానికి నిజాయితీ లేదు. హిందువుల మనోభావాలు, హిందూ జాతి పట్ల ప్రభుత్వానికి కన్సన్ లేదు.

 

ర్యాలీలో స్వయంగా నేను కూడా పాల్గొన్నా. 

పోలీసులు మఫ్టీ లో ఉన్నవారు మా పార్టీకి సంఘాలకు సంబంధం లేని వారు రాళ్లు రువ్వి రెచ్చగొట్టి కావాలని. లాఠీచార్జీ చేసారు. ఈ ప్రభుత్వం మా రక్తాన్ని కళ్ళ చూసింది. వందల మంది మీద అక్రమ కేసులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు.

బి కేర్ఫుల్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఇది నడవదు.

80 శాతం మంది ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తే నిన్ను క్షమించేది లేదు.

ఎంఐఎంకు, వాళ్ళ ఓట్ల కి లొంగిపోయి చిల్లర వేశాలు వేస్తే ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరిస్తున్నాం.

Join WhatsApp

Join Now