కాలువలో దూకిన ప్రేమికుల మృతదేహాలు వెలికితీత
Jul 11, 2025,
కాలువలో దూకిన ప్రేమికుల మృతదేహాలు వెలికితీత
కర్ణాటకలోని సణాపురకు చెందిన అంజలి (19), నింగాపుర యువకుడు ప్రవీణ్ కుమార్ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు తమ ఇళ్ల నుంచి పారిపోయి హగరిబొమ్మనహళ్లిలోని బంధువుల ఇంట్లో ఆశ్రమం పొందారు. విషయం తెలుసుకున్న యువకుడి తల్లి అక్కడికి కారు పంపించి ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తిరిగి వస్తుండగా మునిరాబాద్ డ్యామ్ వద్ద కారును ఆపారు. ఈ క్రమంలో ప్రేమ జంట తుంగభద్ర ఎడమ కాలువలో దూకేశారు. పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.