Site icon PRASHNA AYUDHAM

పోషక ఆహారంతోనే శరీరం దృఢంగా ఉంటుంది జిల్లా కలెక్టర్ 

IMG 20250918 WA0100

పోషక ఆహారంతోనే శరీరం దృఢంగా ఉంటుంది జిల్లా కలెక్టర్

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోషక అభియాన్ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

 

ప్రశ్న ఆయుధం

కామారెడ్డి సెప్టెంబర్ 18

 

ఆరోగ్య నియమావళి పాటించి సరైన పోషకాహారం అందించి శారీరకంగా మానసికంగా దృఢంగా శరీరాన్ని విద్యార్థులు తయారు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆసీస్ సాంగ్వన్ అన్నారు. గురువారం జిల్లాలోని లింగంపేట మండలం పోతాయిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిర్వహించిన స్వచ్ఛత హెసేవ 2025, పోషక అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని స్వచ్ఛతపై విద్యార్థులచే ఏర్పాటుచేసిన మానవహారం కార్యక్రమం లో విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోషక అభియాన్ కార్యక్రమంలో ద్వారా జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడి కేంద్రాల్లో పోషక మాసం కార్యక్రమాన్ని, పౌష్టికాహార విలువలను తెలియజేస్తూ శారీరక మానసిక ఎదుగుదలకు తీసుకోవలసిన పౌష్టికాహారం గురించి తెలపాలని సూచించారు. ఎనీమియా వ్యాధిన పడకుండా ఐరన్ టాబ్లెట్లు కౌమార బాలికలు వేసుకోవాలని అన్నారు. చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు, కౌమార బాలికలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించి అంగన్వాడీలు కేంద్రాల ద్వారా గుడ్లు , పాలు తాజా ఆకుకూరలు కూరగాయలతో స్వచ్ఛమైన ఆహారాన్ని అందించాలన్నారు.

అనంతరం స్వచ్ఛత హే సేవ 2025 కార్యక్రమం జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలు భాగస్వామ్యంతో గ్రామీణ అభివృద్ధికై తోడ్పడి శ్రమదానం చేసి పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహ రెడ్డి, డి ఆర్ డి ఓ సురేందర్ జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల జిల్లా బాలల సంరక్షణ అధికారి స్రవంతి,ఎంపీడీవో, తాసిల్దార్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు,గ్రామస్థాయి అధికారులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Exit mobile version