వాగు వంతెన కొట్టుకుపోయింది

వాగు వంతెన కొట్టుకుపోయింది

లింగంపేట మండలం కురుదు లింగంపల్లి సమీపంలో భారీ వర్షం ప్రభావం 

– మరమ్మతు పనులు ప్రారంభం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 10

 

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లింగంపేట మండలం కురుదు లింగంపల్లి గ్రామ సమీపంలోని వాగుపై ఉన్న వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. వాగులో ఉధృతంగా వచ్చిన వరద నీరు వంతెనను ధ్వంసం చేయడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. స్థానికులు రాకపోకలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని పరిశీలించిన అధికారులు తక్షణమే వంతెన మరమ్మతు పనులు ప్రారంభించారు. ప్రజల సౌకర్యం కోసం తాత్కాలిక రహదారి ఏర్పాట్లు కూడా చేపట్టనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment