బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ – పరకాల లో సాగిన సామాజిక న్యాయ యాత్ర

బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ – పరకాల లో సాగిన సామాజిక న్యాయ యాత్ర

హైదరాబాద్, జూలై 27:

బలహీన వర్గాల సాధికారతే బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, గత పదేళ్లలో అందుకు అనుగుణంగా తీసుకున్న చర్యలే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర శాసనసభ మాజీ మంత్రి కల్వకుంటల తారక రామారావు (కేటీఆర్) పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న సామాజిక న్యాయం పథకం వివరించారు.

32/55 ఎంపీటీసీ (58.15%) స్థానాలు,

49/109 సర్పంచ్ (45%) స్థానాలు,

3/6 జడ్పీటీసీ (50%),

3/6 ఎంపీపీ సీట్లు — అన్నీ బలహీన వర్గాలకు కేటాయించడమే బీఆర్ఎస్ నిబద్ధతకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు.ఇది ఒక్క పరకాల నియోజకవర్గానికి పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఇదే విధానంతో బలహీన వర్గాలకు అత్యధిక రిజర్వేషన్లు అమలు చేశామని ఆయన స్పష్టం చేశారు.కేటీఆర్ మాట్లాడుతూ, “బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసినా, బీఆర్ఎస్ పార్టీ మాత్రం బీసీలకు న్యాయం చేస్తోంది. మేము మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాం. సామాజిక సమతుల్యత మా ప్రభుత్వ ధ్యేయం,” అని వివరించారు.బీఆర్ఎస్ పాలనలో సామాజిక న్యాయం మాత్రమే కాదు, అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో ఉంచుకుని శాశ్వత అభివృద్ధికి బాటలు వేసినదని నేతలు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now