ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి దారుణ హత్య?
జగిత్యాల జిల్లా జాబితాపూర్
మండలం అక్టోబర్ 22:
జాబితాపూర్ మండలం
లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రధాన అనుచరుడు, మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డిని కారుతో ఢీకొట్టాడు.. ఆ తర్వాత కత్తితో పొడిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గంగారెడ్డిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణిం చినట్లు వెల్లడించారు. ఇక, గ్రామంలో రాజకీయ కక్షలే హత్యకి ప్రధాన కారణమని తెలుస్తుంది..
దీంతో జగిత్యాల- ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించిన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లా డుతూ.. తమ్మునిలాంటి వాడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు.జగిత్యాలలో బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా.. లేదంటే కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందాని అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ కరువైందని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడి దారుణ హత్య..
by kana bai
Published On: October 22, 2024 3:51 pm