*చీరాల నుండి సికింద్రాబాద్‌కు నేరుగా బస్సు ప్రారంభం – మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ*
మేడ్చల్ జిల్లా కీసర ప్రశ్న ఆయుధం మే 3
ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, చీరాల మరియు సికింద్రాబాద్ మధ్య తరచూ ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం ఈ బస్సు సర్వీసు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే స్పందించి బస్సును మంజూరు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని పేర్కొన్నారు.
ఈ బస్సు సర్వీసు ప్రారంభోత్సవానికి స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తమ చిరకాల కోరిక నెరవేరడంతో వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ బస్సు సౌకర్యం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు మరియు ఇతర ప్రయాణికులకు సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కొత్త బస్సు సర్వీసు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.