రోడ్డు కిందకు దూసుకెళ్లిన బస్సు..
నిజామాబాద్ ,జనవరి10
బైక్‌ను తప్పించబోయి ఆర్టీసీ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటన నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. బోధన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సు, బైక్‌ను తప్పించే యత్నంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బస్సులో 20 మంది ప్రయాణికులు డ్రైవర్ నాగేశ్వరరావు, కండక్టర్ పద్మావతి తెలిపారు.ఈ ఘటనలో కొంతమందికి ప్రయాణికులకు చిన్నచిన్న గాయాలు అయ్యాయని పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.