కుల గణన సర్వే దేశంలోనే చారిత్రాత్మకం

*కులగణన సర్వే దేశంలోనే చారిత్రాత్మకం*
*సర్వేను ప్రజలంతా విజయవంతం చేయాలి*
*కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు*

*ఇల్లందకుంట నవంబర్ 5 ప్రశ్న ఆయుధం::-*

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఈ నెల 6 తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కులగణన ప్రారంభం కానుందని, ఈ సర్వే దేశంలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంగిలే రామారావు అన్నారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులు ఈ సర్వేను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నింపేందుకే ఈ సర్వేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నదని తెలిపారు సర్వేకు ప్రజలంతా సహకరించాలని ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు సమాజంలోని సంపదను అన్ని వర్గాలకు సమానంగా పంచాలన్నదే రాహుల్ గాంధీ సిద్ధాంతమని అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపడుతున్నదని తెలిపారు తెలంగాణలో నిర్వహిస్తున్న కుల గణన దేశంలోనే రోల్ మోడల్ గా నిలవబోతున్నదని పెండింగ్ లో ఉన్న దశాబ్దాల ప్రజల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలుగా జన గణన చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వం కులగణన నిర్వహిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారని పేర్కొన్నారు సర్వే తో సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు సమన్యాయం సమాన హక్కులు లభిస్తాయని ఏ ఒక్కరికీ నష్టం కలుగకుండా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు ఇల్లందకుంట మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు ఈ సర్వేలో భాగస్వాములు కావాలని సూచించారు ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సహాయ సహకారాలు అందించాలని కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను ఇంగిలే రామారావు కోరారు.

Join WhatsApp

Join Now