*శాస్త్రీయ భాషగా మరాఠీను ప్రకటించిన కేంద్రం*
కేంద్ర ప్రభుత్వం మరాఠీ భాషను అధికారికంగా శాస్త్రీయ భాషగా ప్రకటించింది. మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ ఢిల్లీలో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు. షెకావత్ అధికారికంగా మరాఠీని శాస్త్రీయ భాషగా గుర్తిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. మరాఠీ భాషతో పాటు, బెంగాలీ, పాలీ, అస్సామీ, ప్రాకృత అనే నాలుగు ఇతర భాషలకు కూడా కేంద్ర ప్రభుత్వం శాస్త్రీయ హోదాను మంజూరు చేసింది.