జమ్ముకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రం
Mar 12, 2025,
జమ్ముకశ్మీర్‌లోని రెండు సంస్థలను నిషేధించిన కేంద్రం
జమ్ముకశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న రెండు సంస్థలపై కేంద్ర హోం శాఖ కొరడా ఝలిపించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆ రెండు సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు వేర్పేరు ప్రకటనల్లో తెలిపింది. అవామీ యాక్షన్ కమిటీ, జమ్మూకశ్మీర్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ సంస్థలను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధిత సంస్థలుగా ప్రకటిస్తున్నట్టు పేర్కొంది.