Site icon PRASHNA AYUDHAM

కాంగ్రెస్ పనుల జాతర… కేంద్ర నిధుల మీదే ఆట..

IMG 20250824 WA00461

కాంగ్రెస్ పనుల జాతర… కేంద్ర నిధుల మీదే ఆట..

2200 కోట్లు రాష్ట్రం కేటాయించిందని సీతక్క హడావిడి

వాస్తవానికి ఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్రం వాటా 1320 కోట్లు

కేంద్రం ఇచ్చిన నిధులపై రేవంత్ రెడ్డి డప్పు కొట్టుకోవడం సిగ్గుచేటు

బీర్కూర్‌లో 1.54 కోట్లు… అందులో 96 లక్షలు మోడీ సర్కారు వాటా..

ప్రశ్న ఆయుధం ఆగష్టు 24కామారెడ్డి జిల్లా, బీర్కూర్:

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22న కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా పనుల జాతర ప్రారంభించింది. ఈ సందర్భంగా 2200 కోట్లు అభివృద్ధి పనులకు కేటాయించామని మంత్రి సీతక్క ప్రకటించారు.కానీ వాస్తవానికి ఇవన్నీ ఎన్ ఆర్ ఇ జి ఎస్ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం కేటాయించిన నిధులే. అందులో 1320 కోట్లు కేంద్రం వాటా, 880 కోట్లు రాష్ట్రం వాటా. అయినా కాంగ్రెస్ నేతలు మొత్తం రాష్ట్రం భరిస్తోందంటూ ప్రచారం చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.గ్రామాల్లో భూమి పూజల కోసం వచ్చిన రేవంత్ రెడ్డి, “మనమే నిధులు ఇచ్చాం” అంటూ డప్పు కొట్టుకోవడం బీజేపీ నేతలు సిగ్గుచేటు అన్నారు. వాస్తవానికి సీతక్క ఇటీవల కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరను కలిసి అభివృద్ధి నిధులు కోరగా, కేంద్రం వెంటనే స్పందించి కేటాయించింది అని బీజేపీ మండల అధ్యక్షుడు నాగేల్ల సాయికిరణ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.బీర్కూర్ మండలానికి 1.54 కోట్లు కేటాయించగా, అందులో 96.30 లక్షలు కేంద్రం వాటా అని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోడీ కృషి ప్రత్యేకమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లెల యోగేశ్వర్, ఉపాధ్యక్షులు వడ్ల బసవరాజ్, చేపూరి హనుమాన్లు, నాయకులు బీరుగొండ, రవి, సాయిబాబా, విట్టల్, రాజు, కార్యకర్తలు ప్రవీణ్, సందీప్, గజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version