*నేడు జాతీయ సెలవుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం*
హైదరాబాద్:ఏప్రిల్ 13
విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఎందుకంటే సోమవారం (ఏప్రిల్ 14న) అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యాసంస్థలకు మరో రోజు సెలవు వచ్చింది.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న సెలవు దినంగా ప్రకటించారు. ఇప్పటికే.. ఏప్రిల్ 12 రెండో శనివారం, ఏప్రిల్ 13 ఆదివారం సెలవులు కావడంతో.. సోమవారం కూడా హాలిడే రావడం విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి.
ఇటీవల కేంద్ర ప్రభుత్వ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. సమాజానికి, రాజ్యాంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14వ తేదీన ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు ఏప్రిల్ 14న సెలవు ఉండనుంది. అయితే.. ఈ వారంలోనే ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే ఉంది. ఆరోజు స్కూళ్లకు సెలవు ఉండనుంది.