నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం.

నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం.

మహిళలపై అత్యాచారాలు, హింసను అరికట్టాలి

ఇందిరమ్మ ఇండ్లలో ఒంటరి మహిళలకు అవకాశం కల్పించాలి

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

సిద్దిపేట డిసెంబర్ 30 ప్రశ్న ఆయుధం :

నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న హింసను అరికట్టడంలో ఘోర వైఫల్యం చెందిందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. సోమవారం రోజున ఐద్వా జిల్లా వర్క్ షాప్ జిల్లా అధ్యక్షురాలు సింగిరెడ్డి నవీన అధ్యక్షతన జరగగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారు హాజరై మాట్లాడుతూ… కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలంలో రోజురోజుకు నిత్యవసర సరుకుల ధరను పెంచుతూనే ఉందన్నారు నాడు అధికారానికి వచ్చే ముందు ధరలను తగ్గిస్తానని మాయమాటలు చెప్పి మూడుసార్లు అధికారులు వచ్చేది కానీ అదుపు చేయకపోగా మరింత పెంచిందని తెలిపారు గతంతో పోలిస్తే 100% ధరలు పెరిగాయని వాటి అదుపు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. రోజురోజుకు దేశంలో హత్యలు అత్యాచారాలు మహిళలపై అగత్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు దేశంలో దేశవ్యాప్తంగా రోజుకి 8 అత్యాచారాలు, 90 నిమిషాలకు ఒక వరకట్నపత్యాచారం జరుగుతుందన్నారు వీటిని అదుపు చేయడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఒకవైపు భారతమాతకు జే అంటూ దేశంలో ఉన్న మహిళలకు రక్షణ కల్పించే దాంట్లో ఇబ్బందులు ఉన్నాయన్నారు వీటిని వెంటనే అరికట్టాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను తప్పకుండ అమలు చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇప్పటికే అమలవుతున్న ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలకు కొంత ఉపశమనం ఉన్నప్పటికీ జనాభాకు అనుగుణంగా బస్సు రవాణా లేకపోవడం ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాటిని పరిష్కారం చేయాలని కోరారు అలాగే ప్రతి నెల మహిళలకి 2500 రూపాయలు ఇస్తామని చెప్పి వాటి ఊసే ఎత్తడం లే అని తెలిపారు ఇప్పటికైనా జనవరి నుండి ప్రతినెల 2500 రూపాయలు మహిళల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సౌకర్యాన్ని ప్రతి పేద మహిళలకు అందరికీ కల్పించాలని కోరారు. రాబోవు కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మహిళ వ్యతిరేక విధానాలపై, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై సర్వేలు, ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత గారు తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి అత్తిని శారద, జిల్లా ఉపాధ్యక్షురాలు మంజులత, జిల్లా సహాయ కార్యదర్శిలు జాలిగపు శిరీష, ఇప్పకాయల శోభ, జిల్లా నాయకురాలు సంద బోయిన రాణి, దండు లక్ష్మి, జ్యోతి, లక్ష్మి, శోభ, నరసవ్వ, మల్లవ్వ, విగ్నేశ్వరి, లావణ్య, వరలక్ష్మి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now