యూరియా సరఫరా చేయడం పై కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపడం తగదు

యూరియా సరఫరా చేయడం పై కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపడం తగదు

*జమ్మికుంట ఆగస్టు 21 ప్రశ్న ఆయుధం*

తెలంగాణ రాష్ట్రానికి యూరియా మంజూరు చేపియడంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు పూర్తిగా విఫలం అయ్యారని తెలంగాణ రాష్ట్రానికి 50వేల మెట్రిక్ టన్నుల యూరియా మంజూరుకు కృషి చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయి మూడు నెలలు అవుతున్న తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిన 90 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సింది పోయి 40 వేల మెట్రిక్ టన్నుల కేటాయించి మిగతా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వకుండా తెలంగాణలో ఉన్న రైతు సోదరులను ఇబ్బంది పెట్టడమేనని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదని పేర్కొన్నారు జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబాల రాజు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని మెట్రిక్ టన్నుల ఎరువులు యూరియా కావాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదికించినప్పటికీ కావాలనే తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపడం తగదని తెలంగాణ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మిగతా ఆరుగురు పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రైతాంగం ఇంత ఇబ్బంది పడుతున్న యూరియా కోసం పార్లమెంట్ సమావేశాలలో కానీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా మాట్లాడి తెలంగాణ రాష్ట్రానికి ఖరీఫ్ సీజనుకు సరిపడే యూరియా సరఫరా చేర్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు గతంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రితుమ్మల నాగేశ్వర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ప్రత్యేక సమావేశమై తెలంగాణ రాష్ట్రానికి సరిపడే ఎరువులను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ కాడ నుండి తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలోనూ వివక్ష చూపుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచనతో ఈనెల 12వ తేదీన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ తో కలిసి ఢిల్లీలో కేంద్ర రసాయన ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ సింగ్ పటేల్ కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు నిరంతరం తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులు పడుతున్న ఇబ్బందిపై పార్లమెంట్ పార్లమెంట్ సమావేశాలలో యూరియా కొరత పై మాట్లాడుతూ అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసి తమ తెలంగాణ రాష్ట్రానికి యూరియా లేక రైతాంగం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ ఇలాగే ఎరువుల సరఫరా విషయంలోనే కానీ నిధుల విషయంలోనే కానీ వివక్ష కొనసాగితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు

Join WhatsApp

Join Now

Leave a Comment