కేంద్ర ప్రభుత్వ పధకాలు ప్రజల్లో తీసుకెళ్లాలి
కేంద్ర ప్రభుత్వం పధకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపుకై కృషి చెయ్యాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోత్ స్వరూప పిలుపునిచ్చారు.కొత్తగూడ మండల కేంద్రం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల కు సంబందించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వపథకాలు వివరిస్తూ మండల కేంద్రం లోని వర్తక,వ్యాపార సంస్థల వారికీ మరియు ప్రజలకు పంపిణీ చేశారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం లో దేశం అభివృద్ధి చెందుతుందని, గ్రామ స్థాయి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయని నేడు గ్రామాల్లో సీసీ రోడ్లు,ఉచిత బియ్యం,మరుగుదొడ్లు,యూరియా సబ్సిడీ ఉచిత గ్యాస్,ముద్ర యోజన, విశ్వకర్మ యోజన, ఇలా అనేక పధకాలు లబ్ధిదారులకు అందిస్తున్నారని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బోనాల ప్రవీణ్ చారి, బీజేపీ గిరిజన మోర్చా వనభందు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ. నవీన్ నాయక్,సీనియర్ నాయకుడు తోటకూరి మధు, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కొట్టె శ్రీనివాస్,సీనియర్ నాయకులు బానోత్ హరిలాల్, తుపాకుల పరుశురాం,గుగులోత్ రూప్లా నాయక్,చేవ్వ రాంచందర్,వాసు,గంగాపురపు బిక్షపతి, బోడ సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు