కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి..స్వరూప

కేంద్ర పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి..

బీజేపీ గిరిజన మోర్చా ప్రతినిధి స్వరూప పిలుపు

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి గుగులోత్ స్వరూప పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పథకాలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేశారు.

‘‘నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కేంద్ర పథకాలు సీసీ రోడ్లు, ఉచిత బియ్యం, మరుగుదొడ్లు, యూరియా సబ్సిడీ, ఉజ్వల గ్యాస్, ముద్ర యోజన, విశ్వకర్మ స్కీమ్ వంటి వాటి రూపంలో గ్రామాలకు చేరుతున్నాయి’’ అన్నారు.

ప్రజల్లో ఈ పథకాలపై అవగాహన పెంచి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బోనాల ప్రవీణ్ చారి, గిరిజన మోర్చా వనబంధు సెల్ రాష్ట్ర కన్వీనర్ బోడ నవీన్ నాయక్, సీనియర్ నాయకులు తోటకూరి మధు, బానోత్ హరిలాల్, తుపాకుల పరుశురాం, గుగులోత్ రూప్లా నాయక్, చేవ్వ రాంచందర్, వాసు, గంగాపురపు బిక్షపతి, బోడ సుమన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment