కోడిగుడ్లు, రెండు కూరలు అందించలేము
– మధ్యాహ్న భోజన నిర్వాకుల సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరు చక్రపాణి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కోడిగుడ్లు, రెండు రకాల కూరలు అందించలేమని మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపునూరి చక్రపాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి కార్యాలయం ముందు తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి
కలెక్టర్ కార్యాలయ ఏవో కు వినతిపత్రం సమర్పించరు. ఈ సందర్భంగా ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పీఎం పోషణ మినరల్స్ జిల్లాలోని పాఠశాలల్లో రాగి జావా తయారు చేయడం కోసం రాగి జావా పౌడర్ బెల్లం పంపినప్పటికీ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ అందిస్తున్న విద్యార్థులకు మాత్రం ఎలాంటి పారితోషికం ఇవ్వడం లేదని, ఈ పథకం కోసం తెలంగాణలో 8 కోట్ల రూపాయలు నిల్వ ఉన్నందున నిర్వాకులకు నెలకు వెయ్యి రూపాయలు ఇప్పించాలని కోరుతున్నామన్నారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా మేస్ చార్జీలు పెంచాలని, ప్రతి విద్యార్థికి ఒక్కొక్కరికి 25 రూపాయలు చొప్పున స్లాబ్ రేట్ చెల్లించడంతోపాటు వంట కార్మికులను ఇష్టం వచ్చినట్టుగా తొలగించకుండా జీవోను విడుదల చేయాలన్నారు. వంట చేస్తున్న సందర్భంలో జరుగుతున్న ప్రమాదాలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదివేల వేతనం చెల్లించాలని వీటితోపాటు కోడిగుడ్లు వారానికి మూడుసార్లు పెట్టాలని అధికారులు మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. కోడిగుడ్డు ధర మార్కెట్లో 8 రూపాయలు ఉందనీ, ప్రభుత్వం ఇచ్చేది ఐదు రూపాయలు కాబట్టి కోడిగుడ్లు అందించలేము, మెనూ ప్రకారం పెట్టాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. రెండు కూరలకు చేయాలంటే 25 రూపాయలు కావాలి కాబట్టి రెండు కూరలు అందించలేము, వంటగ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సాయిలు, సోఫియా, సంగీత, వెంకటేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.