Site icon PRASHNA AYUDHAM

మార్చి 19 లోపు ఓటర్ జాబితా సవరణ,ఇతర అంశాల పై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

IMG 20250313 WA0281

ప్రశ్న ఆయుధం న్యూస్ మార్చి 13 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ జిల్లాలో ప్రతి 3 నెలలకు ఒకసారి పకడ్బందీగా అప్ డేట్ కావాలని, నూతనంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక పౌరుడికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్ జాబితా సవరణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాల పై జిల్లా ఎన్నికల అధికారులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మార్చి 19 లోపు సమావేశాల నిర్వహణ పూర్తి చేయాలని ఆదేశించారు.

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం మినిట్స్ ఇతర వివరాలను మార్చి 27 లోపు ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని ఆయన ఆదేశించారు.జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో, అదే విధంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రెవెన్యూ డివిజన్ అధికారులు, ఏం.ఆర్.ఓ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో నూతన ఓటర్ నమోదు, ఓటు బదిలీ, మరణించిన వారి ఓటర్ వివరాల తొలగింపు వివిధ అంశాలకు వాడే ఫారం 6,7,8 వివరాలను పూర్తి స్థాయిలో వివరించాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, ఎలక్షన్ సూపర్డెంట్ రంగ ప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version