ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి

– మహా ర్యాలీ తో వెళ్లి ఇందిరా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన సమగ్ర శిక్ష ఉద్యోగులు

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారం నాటికి 23వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న శిబిరం నుంచి ఇందిరా గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి మాజీ భారత ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి సమగ్ర శిక్ష ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారు.

IMG 20250101 WA0023

డిమాండ్లను పరిష్కారం అయ్యే విధంగా రేవంత్ రెడ్డి కి తెలుపాలని ఈ నిరసనను చేపడుతున్నట్టు వాళ్ళు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు వాసంతి మాట్లాడుతూ సీఎం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, విద్యా బోధన ఆపేసి మహిళల మైన మేము ప్రజా పాలనలో రోడ్లమీదకి ఎక్కి నిరసన తెలుపుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.

IMG 20250101 WA0025 చేస్తున్న సమయంలో ఇప్పటికే ఇద్దరు ఉద్యోగులు చనిపోయారని, బుధవారం సిద్దిపేట జిల్లా మహిళా ఉద్యోగి సమ్మెలో హార్ట్ స్ట్రోక్ గురైందని ఆమెకు ఏదైనా జరిగితే ప్రభుత్వందే పూర్తి బాధ్యత అని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలనీ, అప్పటివరకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలుపుకుంటారని మా ఉద్యోగులకు పూర్తి విశ్వాసం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాల వాసంతి,నాయకులు శ్రీధర్ రాములు,కాళిదాసు, శైలజ,సంతోష్ రెడ్డి, వీణ, వనజ,మంగా, శ్రీవాణి,గంగా ప్రసాద్,మాధవి, కళ్యాణ్,సంధ్య,లింగం, కృష్ణ,దినేష్,వీణ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now