గాంధారి మార్కండేయ ఆలయంలో చోరీ
హుండీ పగలగొట్టి రూ.3 వేల నగదు ఎత్తుకెళ్లారు
ఆలయ కమిటీ సభ్యుడు ఫిర్యాదు, కేసు నమోదు
అదే గ్రామంలో మోటార్‌సైకిల్ దొంగతనం
దర్యాప్తు ప్రారంభించిన గాంధారి పోలీసులు
ప్రశ్న ఆయుధం గాంధారి, సెప్టెంబర్ 16
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని శివ భక్త మార్కండేయ ఆలయంలో చోరీ జరిగింది. 20 రోజుల క్రితం ఏర్పాటు చేసిన హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి అందులో ఉన్న దాదాపు రూ.3 వేల నగదు ఎత్తుకెళ్లారు.
ఈ విషయమై ఆలయ కమిటీ సభ్యుడు గుటుకు అశోక్ ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గ్రామంలో మరో ఘటనలో ఒక మోటార్‌సైకిల్ కూడా దొంగతనం జరిగినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.