కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సిఐటియు మండల కమిటీ నిరసన

*కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా సిఐటియు మండల కమిటీ నిరసన*

*జమ్మికుంట ఫిబ్రవరి 5 ప్రశ్న ఆయుధం*

పేదలు మధ్యతరగతి ప్రజలపై పన్నులు వేసి కార్పొరేట్ పెద్దలకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా బుధవారం జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సిఐటియు మండల కమిటీ నాయకులు నిరసన నిర్వహించారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ ప్రజల తక్షణ మౌలిక అవసరాలకు కేంద్ర బడ్జెట్ దారుణంగా ద్రోహం చేసిందనీ మూకుమ్మడి నిరుద్యోగం, వేతనాల కుంగుబాటు, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడం కారణంగా ఆర్థిక వ్యవస్థలో అనేక సమస్యలు వస్తున్నాయనీ ప్రజల డిమాండ్ పరిష్కరించడానికి బదులుగా మోడీ ప్రభుత్వం సంపన్నులకు మరిన్ని రాయితులు ఇవ్వడం జరిగిoదనీ తెలిపారు.కార్మిక కర్షక లోకానికి కోతలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం చేస్తుందనీ సంపన్నులపై బడా కార్పొరేట్ సంస్థలపై పన్నులు విధించడం, ఉపాధి కల్పనకు సహాయపడేలా ప్రభుత్వ పెట్టుబడులను విస్తరించడం, కనీస వేతనాలుకు హామీ బదులుగా అందుకు విరుద్ధమైన పంథాను కేంద్రప్రభుత్వం ఎంచుకుందన్నారు.ప్రైవేటు పెట్టుబడులను పెంపొందించి, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం, నిరుద్యోగ సమస్యను ఈ బడ్జెట్ లో పూర్తిగా విస్మరించిందని ద్రవ్యోల్బణం పరిగణలోకి తీసుకుంటే ఆహార సబ్సిడీలు వ్యవసాయం దాని అనుబంధ కార్యకలాపాలు విద్యా, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, సామాజిక సంక్షేమం, పట్టణాభివృద్ధి రంగాలపై పెట్టే ఖర్చు గత ఏడాది కంటే బాగా తగ్గిపోయిందని విమర్శించారు. అందుకని ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, ఉపాధి అవకాశాలు సృష్టించడం, వేతనాలు పెంచడం ద్వారా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు 86 వేల కోట్ల వద్దే నిలిచిపోయిందనీ 12 లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పెంచడం వల్ల ఒక వర్గాన్ని ఢిల్లీ ఎన్నికల కోసం పెట్టిందనీ తెలిపారు. కానీ ధరల పెరుగుదల, జిఎస్టి వంటి పన్నులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ వివరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ జక్కుల రమేష్ మండల నాయకులు ఎండిగ రవీందర్రావు, ఆసాల సారయ్య , రాజేశ్వరరావు, పోచాలు, కిరణ్, ప్రవీణ్ సాయి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment