తమ సమస్యల సాధనకై నిరవధిక సమ్మె ప్రారంభించిన సివిల్ సప్లై అమాలీలు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కామారెడ్డి ఆర్ డి ఓ ఆఫీస్ ముందు సివిల్ సప్లై హమాలీలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలు నిర్వాదిక సమ్మెను బుధవారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న హమాలీలు చేస్తూనే సమ్మె ప్రారంభం రోజు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది వీఎల్ నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ గత ప్రభుత్వము పెంచిన అమలు రేట్లు అమలు చేయకుండా సంవత్సరం పాటు కాలయాపన నిర్వహించారని, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలకు పిలిచి ఎగుమతి దిగుమతి రేట్లు క్వింటాలకు 29 రూపాయలు పెంచిన అమలీల రేట్లను వెంటనే అమలు చేయాలని జీవోలు వెంటనే విడుదల చేయాలని ఆయన అన్నారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 7 గోదాములు అద్దె భవనాలోనే కొనసాగుతున్నాయని, అనేక సమస్యలతో కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఇబ్బందులకు గురవుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము సొంత గోదాములు నిర్మించాలని ఆయన అన్నారు. అట్లాగే ఈఎస్ఐ సౌకర్యం, 60 సంవత్సరాలు నిండిన కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని, ప్రమాదలో మృతి చెందిన కార్మికునికి పది లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఎగుమతి దిగుమతి రేట్లు రాష్ట్ర ప్రభుత్వము పెంచకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధం కావాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. నిరుపేదలకు బియ్యము అందించే కార్మికులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందిందని ఇప్పటికైనా వీరి డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ నిరువాధిక సమ్మెలో కామారెడ్డి ఎమ్మెల్యేస్ పాయింట్ కార్మికులు. కే బీరయ్య, వై గంగరాజు, కె బాజీ భీమయ్య, ఎల్లేశం శ్రీనివాస్, సంపత్, ప్రసాద్, ప్రవీణ్, మహేష్, బాలమల్లు, కిష్టయ్య, సంపత్, సాయిలు, శ్రీకాంత్, పద్మ మొదటిరోజు రోజు సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. దశరథ్ కామారెడ్డి మున్సిపల్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ సుదర్శన్ రాజు. డి ఈ ఓ శ్రీకాంత్ ఈ సమ్మెకు సంఘీభావం తెలిపారు.