తవ్వుకొ అమ్ముకో అనేవిదంగా మట్టి మాఫియా..?

*సినిమాను తలపించేలా చేరువులో మట్టి తవ్వకలు*..!!

*తవ్వుకొ అమ్ముకో అనేవిదంగా మట్టి మాఫియా*

*ఇరిగేషన్ అధికారులను సైతం లెక్కచేయని దళారులు*

*కమిషన్ల తో వేరే జిల్లా,మండలాలు, గ్రామాలకు చెరువు మట్టిని తరలుపు*

*ఒకే చెరువులో వేరే రాష్ట్రాలు,జిల్లాల నుండి 4 పెద్ద పెద్ద జేసిబిలు,ట్రిప్పర్ లతో అధిక లోతు తో మట్టి తవ్వకాలు*

*గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్న మట్టి వ్యాపారం..!!

*చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు*..?

*మట్టివేస్తుంది రైతుల చేనులోనే కాని స్థానిక రైతు చేనులల్లో కాదు*

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ ప్రతినిధి ఏప్రిల్-16

జిల్లా జుక్కల్ నియోజక వర్గం లోని పెద్దకొడప్గల్ మండల పరిధిలో గల వడ్లం తండా చెరువులో గత నెల రోజుల నుండి జోరుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి..

గత ప్రభుత్వ హయం లో మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చెరువులో మట్టి తవ్వకలు జరిగాయి. అయిన..అప్పటి నుండి ఇప్పటి వరకు కొంత మంది దళారులు కమిషన్ల తో వేరే జిల్లా,రాష్ట్రాలనుండి (సంగారెడ్డి,కర్ణాటక) నుండి జేసిబి, టిప్పర్లు లను తెప్పించి

అధిక లోతుతో మట్టి తవ్వి అట్టి మట్టిని స్థానిక  రైతుల చేనులలో కాకుండా వేరే శివారు,వేరే గ్రామాలు,మండలాల్లో రైతులకు మట్టిని అమ్ముతున్నారు. ఇట్టి విషయం పై స్థానిక ఇరిగేషన్ అధికారులు సైతం పలు సార్లు హెచ్చరించిన లెక్కచేయకుండా

దళారులు మట్టి వ్యాపారం చేస్తున్నారు.

ముక్యంగా ఇ మట్టి దళారుల్లొ ఎక్కువశతం బీఆర్ఎస్ వ్యక్తులే ఉండడం గమనర్హం.

స్థానిక తండా ప్రజలు తమ చేనుల్లో వేసుకుందామంటే మట్టి లేకుండా చేస్తున్నారు అని వాపోయారు.

పిల్లలు చెరువుల్లో ఇతకొట్టానికి వెళ్తే చనిపోయే విద్దంగా చాలా లోతుగా మట్టిని తీస్తున్నారు అని ఆవేదన చెందారు..

చెరువులో చేపలు పట్టుకునే బోయవారు సైతం ఇ చేరువులొ చేపలకాని వెళితే కచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. గ్రామాలలో కొంతమంది దళారులు ఇ చెరువును ఒక వ్యాపార కేంద్రంగా చేసుకున్నారు అని యువకులు తెలియజేశారు.

ప్రభుత్వ అధికారులు వెంటనే అట్టి దళారులపై చర్య తీసుకొని ఇకపై చెరువులో ఎలాంటి మట్టి తవ్వకాలు జరగకుండా చూడాలని తండాల ప్రజలు కోరారు..

Join WhatsApp

Join Now

Leave a Comment