హైదరాబాద్ : లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి: కలెక్టర్
Jul 22, 2025,
హైదరాబాద్ జిల్లాలో ఈనెల 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారి, మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా ఈనెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ, మెడికల్ క్యాంపులకు సంబంధించిన షెడ్యూల్ సిద్ధం చేయాలని, భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.