ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్
ప్రశ్న ఆయుధం, నవంబర్ 19, కామారెడ్డి
ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాలు -2024
కార్యక్రమం సందర్భంగా మంగళవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,
అదనపు కలెక్టర్ వి.విక్టర్, కళా భారతి వద్ద ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ కళా యాత్ర ద్వారా ప్రజా పాలనలో ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు తీరును, విజయాలను ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ,ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, తెలంగాణ సాంస్కృతిక కళా కారులు పాల్గొన్నారు.