స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశం

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం ఆగస్టు 5

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మిక్కినినేని మను చౌదరి, ఈ నెల 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకలపై ఆయన అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, విజయేందర్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు.

కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, వేడుకలకు వచ్చే అతిథులు, అధికారులు, సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్ శాఖకు అతిథులకు గౌరవ వందనం, బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉద్యానవన శాఖకు వేదిక వద్ద షామియానా, కుర్చీలు, బారికేడింగ్, పూల అలంకరణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కో అధికారులకు విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఐ అండ్ పీఆర్ శాఖకు మైక్, సౌండ్ బాక్స్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.విద్యాశాఖ అధికారులకు దేశభక్తిని పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసేందుకు అన్ని శాఖల వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వేడుకలు విజయవంతం కావడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, కలెక్టరేట్ పరిపాలనా అధికారి రామ్ మోహన్, పోలీస్ అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment