ప్రజావాణి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలి కలెక్టర్ ఆదేశం

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 30 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.ఈ సందర్భంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులను వివరాలను అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖల వారీగా అధికారులను ఆదేశించారు.గ్రీవెన్స్ లో కొన్ని ఫిర్యాదులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హనుమాన్ బస్తీకి చెందిన రాజుల సరోజిని భర్త రాజుల వెంకటేశ్వర్లు తన భర్త గుండె నొప్పితో చనిపోయారని సొంత ఇల్లు లేక కిరాయి ఇంటిలో ఉంటూ కిరాయి కట్టలేక కుటుంబం గడవడం కష్టంగా మారిందని పెన్షన్ కూడా రావడం లేదని తనకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించగలరని చేసిన దరఖాస్తులను పరిశీలించి తగు చర్యల నిమిత్తం హౌసింగ్ డిపార్ట్మెంట్ కు ఎండార్స్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాజులరాజాం బస్తి కి చెందిన మహేష్ శంకర్ తండ్రి వీరయ్య కూలి పని చేసుకుని జీవిస్తున్నానని చాలీచాలని కూలీతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తన భార్య చనిపోయిందని తనకు ప్రభుత్వం నుండి పెన్షన్ మంజూరు చేయించగలరని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం డి ఆర్ డి ఓ కు ఎండార్స్ చేశారు.
చంద్రుగొండ మండలం తోకల గూడెం గ్రామానికి చెందిన బురుగు రామారావు తండ్రి పాపయ్య తాను ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి బిఈడి కోర్సు పూర్తి చేసి దీనికి సంబంధించిన ప్రిపరేషన్ లో ఉన్నానని ఆర్థిక ఇబ్బందుల వలన నేను ఏదైనా ఉపాధిని పొందాలనుకుంటున్నానని అందుకొరకు మా యొక్క చంద్రుగొండ మండల పరిధిలో గల విద్యా సంస్థల్లో ఏదైనా ఉపాధిని కల్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎండార్స్ చేశారు.మణుగూరుకు చెందిన మాదాసు రిషిత తండ్రి అబ్రహం నేను పదో తరగతి వరకు చదివి ఉన్నానని తన చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో తనకంటూ ఎవరూ లేక ఒంటరిగా జీవనం సాగిస్తూ చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నానని తన పరిస్థితిని ఆలోచించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురుకులాల్లో హాస్టల్లో ఖాళీగా ఉన్న కుక్/ వాచ్మెన్ పోస్టులలో ఏదైనా ఒకటి ఇప్పించగలరని ఆర్ సి ఓ కి ఎండార్స్ చేశారు.
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో పశువులు విచ్చలవిడిగా రోడ్లమీద మరియు పంట పొలాల్లో పంటను నాశనం చేస్తున్నాయని, రహదారులు వెంట వాహనదారులు ఇబ్బందులకు గురి అవుతున్నారని, కావున మున్సిపాలిటీ పరిధిలో బందెల దొడ్డి నిర్వహణ చేపట్టాల్సిందిగా స్థానికులు చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యలు నిమిత్తం మున్సిపల్ కమిషనర్ మణుగూరుకు ఎండార్స్ చేయడమైనది
ఈ ప్రజావాణి కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now