చిన్న మల్లారెడ్డిలో చెత్త పై కలెక్టర్ ఆగ్రహం
వాహనం ఆపి స్వయంగా పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
పరిసరాలు అపరిశుభ్రంగా మారాయన్న కలెక్టర్
వెంటనే చెత్త తొలగించాలి – ఎంపీడీవో, కార్యదర్శికి ఆదేశాలు
గ్రామ ప్రజలకు అవగాహన కల్పించండి అని సూచన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం ఆగస్టు 5.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం రోజు కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామ సమీపంలో ప్రధాన రహదారి వెంట చెత్త కుప్పలు కనిపించడంతో తన వాహనాన్ని ఆపించి పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు చెత్తను ఇక్కడ పడేస్తుండటంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి వ్యవహారాలు అనవసరమైన దుష్ప్రభావాలను తెచ్చిపెడతాయని పేర్కొంటూ వెంటనే చెత్తను తొలగించాలని ఎంపీడీవో ఎఫ్సిబా రాణి, గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నివారించాల్సిందిగా స్పష్టం చేశారు.