మూడు దశాబ్దాల కలయిక అపూర్వం..!!
కళ్యాణదుర్గం ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆటపాటలతో అలరిస్తూ
50 ఏళ్ల వయసులో 30 ఏళ్ల కిందటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని చదువుకున్న కళాశాలలో ఆదివారం ఒక్కచోట చేరిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది. కళ్యాణదుర్గం ఎస్ వి జిఎం డిగ్రీ కళాశాలలో 1993 – 96 మధ్య బిఏ , బీకాం చదివిన నాటి విద్యార్థులు ఆత్మీయ కలయిక పేరుతో ఒకచోట చేరి జ్ఞాపకాలను పంచుకున్నారు. నాటి గురువులను రప్పించి వారికి సన్మానం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. సెల్ ఫోన్ లేని యుగంలో పేద , మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత చదువుల కోసం పట్టణానికి వచ్చి కృషి, పట్టుదలతో ఎదిగిన తామంతా దేవుడు ఆశీస్సులు, గురువుల దీవెనలతో ఓ స్థాయిలో స్థిరపడ్డామని గుర్తు చేసుకున్నారు. భావితరాలకు , కుటుంబ సభ్యులకు సలహాలు సూచనలు ఇచ్చే స్థాయికి చేరిన ఐదు పదుల వయస్సు వారంతా కేరింతలు కొట్టడం ఆత్మీయ కలయిక లో కొసమెరుపు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లలు, కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగు వారితో తో సఖ్యతగా మెలుగుతూ జీవితం ముందుకు సాగించాలని గురువుల సైతం నాటి శిష్యులకు హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి జి ఎం డిగ్రీ కళాశాల తాజా మాజీ ప్రిన్సిపల్ జయరామిరెడ్డి, నాటి అధ్యాపకులు సురేష్ కుమార్ (కామర్స్) చెంగలయ్య , ఎకనామిక్స్ సురేష్, రాధాకృష్ణ, చంద్రమౌళి, పాల్గొనగా కార్యక్రమ నిర్వాహకులు కంబాల తిమ్మారెడ్డి, పాతిరెడ్డి, కరణం తిప్పేస్వామి,ఆది ఆంధ్రా తిప్పేస్వామి , గోవర్ధన్, రెడ్డి తిప్పేస్వామి, రాజేంద్ర, పెన్నప్ప, సత్యనారాయణ, గంగాధర్, రహమత్ బి, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.