ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మార్పు లేదు వరద ముప్పు ప్రాంతాల్లో కంపు పోలేదు

*ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మార్పు లేదు వరద ముప్పు ప్రాంతాల్లో కంపు పోలేదు*

*వర్షాలు వస్తే బిక్కుబిక్కుమంటున్న కాలనీవాసులు*

*బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు*

 *బిజెపి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా*

*జమ్మికుంట జులై 4 ప్రశ్న ఆయుధం*

ప్రభుత్వాలు మారిన పరిస్థితులు మారలేదని వరద ముప్పు ప్రాంతాల్లో కంపు పోలేదని బిజెపి పట్టణ అధ్యక్షుడు పులకాని రాజు అన్నారు వర్షాకాలం వచ్చిందంటే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని వరద ముంపు ప్రాంతాలైన హౌసింగ్ బోర్డు కాలనీ, అంబేద్కర్ కాలనీ, రామన్నపల్లె, కృష్ణ కాలనీలోని ప్రజలు అరచేతిలో తమ ప్రాణాలను పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన దుస్థితి నెలకొందని గత ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా పరిస్థితిలో మార్పు లేదు, నాయకులు మారిన ముంపు ప్రాంతాల్లో కంపు పోలేదని బిజెపి పట్టణాధ్యక్షుడు కొలకాని రాజు ఎద్దేవా చేశారు గత నెల రోజుల క్రితం భారతీయ జనతా పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ ఆద్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కి వరద ముంపు ప్రాంతాల్లో వరద ముంపు తగ్గించడానికి నిధులు కేటాయించి, కొత్తగా కాలువలు నిర్మించాలని వినతి పత్రం అందజేసిన ఏలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని కమిషనర్ స్పందించకపోవడంతో శుక్రవారం జమ్మికుంట బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు బిజెపి శ్రేణులతో కలిసి గాంధీ చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి మున్సిపల్ ఆఫీస్ ముట్టడించి, ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గెలిచిన దగ్గరి నుండి నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని, వెయ్యి కోట్ల రూపాయలు తీసుకువచ్చి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన కౌశిక్ రెడ్డి కనీసం తన ఎమ్మెల్యే నిధులు నుంచి కూడా ఒక పైసా కూడా ఖర్చు చేయలేదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ కమిషనర్ రెండు ఆర్థిక సంవత్సరాల పన్ను వసూలు ముందుగానే ప్రజల ముక్కు పిండి వసూలు చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన జమ్మికుంట మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వం నుండి ప్రశంస పత్రంతో పాటు పారితోషికంగా మూడు కోట్ల రూపాయలను మున్సిపాలిటీకి ఇచ్చిందని, ఆ నిధులు వరద ముంపు ప్రాంతాల్లో కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ ప్రజలు, నాయకులు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు జీడి మల్లేష్, రమారెడ్డి , కోరే రవి, అప్పం మధు, బచ్చు శివ కుమార్, వేముల జగన్, మాజీ కౌన్సిలర్ తుడి రవిచందర్, కనుమల్ల లక్ష్మి, కొండపర్తి ప్రవీణ్, అప్పాల రవిందర్, ముకుందా సుధాకర్, రామస్వామి, రాజేష్, రాకేష్ ఠాకూర్, కైలాసకొటి గణేష్, పల్లపు రవి, మోతె స్వామి, ఇటుకాల స్వరూప, మేడిపల్లి మహేష్, బోనగిరి ప్రణీత్, కొలకాని అరవింద్, కొండ్లె నగేష్, యాంసాని సమ్మయ్య, బూరుగుపల్లి రాము, రాచపల్లి ప్రశాంత్, శ్రీవర్తి ప్రవీణ్, మేక సుధాకర్ రెడ్డి, పోలు వెంకటేష్, మంథని అశోక్, నెల్లి రాజు, సమ్మిరెడ్డి, కొండ్ర సులోచన, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment