Site icon PRASHNA AYUDHAM

అన్నదాతకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం- నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడిదల ప్రణవ్

*అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం- కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్*
*రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానం*
*కేబినెట్ ఆమోదంతో సన్న వడ్లకు 500 బోనస్*
*గ్రామ,గ్రామాన కోనుగోలు కేంద్రాలు ప్రారంభం*
*రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు*
*రానున్న రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో కోనుగోలు కేంద్రాలు ప్రారంభం*

*హుజురాబాద్ అక్టోబర్ 31 ప్రశ్న ఆయుధం::-*

అన్నదాతలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎన్నికల సమయంలో వరంగల్ లో ఏర్పాటు చేసిన రైతులకు డిక్లరేషన్ లో ప్రకటించిన నాటినుండి ఇప్పుడు ప్రకటించిన బోనస్ వరకు రైతులకు ఉపయోగపడే పనులు చేశామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ లో సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం హర్షదాయకమని,ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని గతంలో ఇబ్బడి,ముబ్బడిగా మిల్లర్లకు అల్లార్ట్మెంట్ ఇచ్చి ఇప్పటివరకు లెక్కలు లేకుండా పోయాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు కలగకుండా మిల్లర్లకు ప్రణాళికతో అల్లర్ట్మెంట్ జరుగుతుందని దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోల్లు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు సన్నవడ్లు పెట్టమని ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి రైతులను మోసం చేసిందని,కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్నవడ్లు పండించిన ప్రతి రైతు ఖాతాలో క్వింటాలుకు 500 చొప్పున జమ చేస్తుందని దీన్ని రైతులందరూ ఉపయోగించుకోవాలని కోరారు.ఇప్పటికే గ్రామాలలో ఐకెపి సెంటర్లు ప్రారంభించామని,రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని,రానున్న రెండు రోజుల్లో వరకు పూర్తి స్థాయిలో కోనుగోలు కేంద్రాలు ప్రారంభం అవుతాయని,పక్కగా రైతులకు బోనస్ ఇస్తామని భరోసా ఇచ్చారు.కొనుగోలు విషయంలో మిల్లర్లు రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఆదేశాలు జారీ చేశామని ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని,రైతు పండించిన చివరి గింజవరకు తమ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు.మరోవైపు 500 బోనస్ క్యాబినెట్ ఆమోదంతో ప్రతిపక్షాలకు ఏం చేయాలో అర్థం కాక అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.అలాగే కల్లాల వద్ద రైతులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని,టార్ఫలిన్ కవర్లు బార్ధన్ సకాలంలో రైతులకు అందించాలని కోరారు.

Exit mobile version